Breaking News : విద్యార్థి నేతకే హుజూరాబాద్ టిఆర్ఎస్ టికెట్ ?

0
129

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. ఈటల పార్టీని వీడి రాజీనామా చేసిన ఈ సీటులో పోటీ చేసేందుకు హేమాహేమీలు, వారి కుటుంబసభ్యులు టికెట్ ఆశించారు. కానీ ఒక విద్యార్థి నేతను అభ్యర్థిగా ప్రకటించాలని సిఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

హుజురాబాద్ టీఆరెస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసిఆర్ దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ఈనెల 16న సభలో కేసిఆర్ అధికారంకంగా ప్రకటించే చాన్స్ ఉందంటున్నారు.

సిఎం కేసిఆర్ తో గెల్లు శ్రీనివాస్ యాదవ్

గతంలో ఈటల రాజేందర్ కు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దగ్గరి సహచరుడు. బాల్క సుమన్ తర్వాత విద్యార్థి విభాగం అధ్యక్షుడయ్యాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. పార్టీని ధిక్కరించేలా ఈటల రాజేందర్ మాట్లాడిన క్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈటల టార్గెట్ గా ప్రతి విమర్శలు చేస్తూ కేసిఆర్, కేటిఆర్ మన్ననలు పొందారు. దీంతో ఈటలను ఢీకొట్టేందుకు సామాజిక సమీకరణాలు, ఇతరత్రా చూస్తే గెల్లు సరైన అభ్యర్థిగా కేసిఆర్ భావించినట్లు తెలుస్తోంది.