బ్రేకింగ్ న్యూస్ – హైదరాబాద్లో సిటీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం

బ్రేకింగ్ న్యూస్ - హైదరాబాద్లో సిటీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం

0
95

తెలంగాణలో నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే… ఇక రాత్రి 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావడానికి లేదు. అత్యవసర సర్వీసులకి మాత్రమే రావాలి, అయితే మెట్రో రైళ్ల సమయాల్లో కూడా మార్పులు వచ్చాయి, తొలిరోజు చాలా వరకూ ఇది సక్సస్ అయింది, రాత్రి 9 తర్వాత అన్నీ వ్యాపారాలు దుకాణాలు మాల్స్ రెస్టారెంట్లు క్లోజ్ అయ్యాయి, గేదరింగ్ తగ్గింది.

 

ఫుడ్ కోర్టులు రెస్టారెంట్లు మార్కెట్లు అన్నీ క్లోజ్ అయ్యాయి, దీని వల్ల మరో వారంలో దీని ఫలితం కనిపిస్తుంది అంటున్నారు అధికారులు, అయితే..నైట్ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఇకపై రాత్రి ఏడు గంటలకే సిటీ బస్ సర్వీసుల చివరి ట్రిప్ను ముగించాలని నిర్ణయించింది.

 

 

అంటే చివరి ట్రిప్ ముగించుకుని రాత్రి 9 గంటలకు ఆర్టీసీ బస్సులు డిపోలకు చేరుకుంటాయి, ఇప్పటి వరకూ తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే తొలి ట్రిప్లను ఆరు గంటలకు మార్చింది. ఇక వేరే స్టేట్స్ నుంచి వచ్చే బస్సులు వెళ్లే బస్సులకి ఎలాంటి ఆంక్షలు లేవు.

 

ఇక వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రి 9 తర్వాత వస్తే సిటీ బస్సులు ఉండవు కనుక మీరు ఆటోలు క్యాబ్ లు వాడుకోవచ్చు, మీరు జర్నీ టికెట్ చూపించాల్సిందే..కర్ఫ్యూ ఉన్నా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు టికెట్ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు, అలాగే టికెట్ చూపించి రైల్వేస్టేషన్ విమానాశ్రయం చేరుకోవచ్చు.