బ్రేకింగ్ న్యూస్ – హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు ప్రాంతాలు మూసివేత

బ్రేకింగ్ న్యూస్ - హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు ప్రాంతాలు మూసివేత

0
70

గ్రేట‌ర్ ప‌రిధిలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది, తెలంగాణ‌లో ప‌దివేల కేసులు న‌మోదు అయ్యాయి.. ముఖ్యంగా రోజుకి 700 కి పైగానే కేసులు న‌మోదు అవుతున్నాయి, ఏకంగా రోజుకి 800 కేసులు న‌మోదు అవుతున్న ప‌రిస్దితి.

లాక్ డౌన్ లో త‌క్కువ కేసులు ఉన్న తెలంగాణ‌లో ఒక్క‌సారిగా అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. దీంతో నగర ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎవ‌రికి వారు స్వియ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే.

ఈ కేసుల సంఖ్య పెర‌గ‌డంతో నగరంలోని కొన్ని ముఖ్యప్రాంతాలను మూసివేయాలని ఆ ప్రాంత అసోసియేషన్ నిర్ణయించింది. ఎప్పుడు కొనుగోలుదారులతో సందడిసందడిగా ఉండే సికింద్రాబాద్ జనరల్ బజార్ ను, ఆ పక్కనే ఉండే సూర్యా టవర్స్ ను, ప్యారడైజ్ సర్కిల్ ను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మార్కెట్ జూలై 5 వ‌ర‌కూ మూసివేస్తున్నామ‌ని తెలిపారు, అక్క‌డ ఎలాంటి వ్యాపారాలు జ‌ర‌గ‌వు.