ఓ పక్క కరోనాతో అందరూ బెంబెలెత్తుతున్నారు, ఇలాంటి వేళ ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది…తెల్లవారుజామున భారీ భూకంపం వచ్చింది.. సులవేసి దీవిలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదయ్యింది. ఒక్కసారిగా భవనాలు కుప్పకూలిపోయాయి.
- Advertisement -
ఈ దారుణమైన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు..అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ప్రమాదం జరిగింది…7 సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దాదాపు ఈ ప్రాంతంలో 60 భవనాలు కుప్పకూలిపోయాయి…చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సులవేసి దీవిలోని మముజుకి దక్షిణంగా 36 కిలోమీటర్ల దూరంలో లోతున భూకంపం గుర్తించారు.