బ్రేకింగ్ న్యూస్ …. నెల రోజుల పాటు 144 సెక్షన్

బ్రేకింగ్ న్యూస్ .... నెల రోజుల పాటు 144 సెక్షన్

0
97

ఓ పక్క దేశంలో ట్రంప్ పర్యటన కొనసాగుతోంది.. ఈ సమయంలో దేశంలో ఓ ఘర్షణ పెను వార్తగా మారింది…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ సీఏఏ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఇప్పటిక చెలరేగిన హింసలో మొత్తం ఏడుగురు మరణించారు.

ఒకరు పోలీసు హెడ్ కానిస్టేబుల్ కాగా.. ఆరుగురు సాధారణ వ్యక్తులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఆందోళనకారుల రాళ్ల దాడులు, దుకాణాల విధ్వంసం, పోలీసుల లాఠీ చార్జి కొనసాగుతున్నాయి, దీంతో ఢిల్లీలో ఏం జరుగుతోంది అని టెన్షన్ పడుతున్నారు అందరూ.

ఇక టైర్లు తగలపెడుతున్నారు..దట్టమైన పొగతో మొత్తం మబ్బులా కమ్ముకుంటోంది.. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో వందలమందికి గాయాలు అవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో స్కూళ్లు కాలేజీలు మూసేశారు. జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా వేశారు.. ప్రధానంగా జఫరాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, ఖురేజీ ఖాస్, భజన్ పురా ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య దాడులు సాగుతున్నాయి…. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో వచ్చే నెల 21 వరకూ 144 సెక్షన్ విధించారు .. అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది