దేశంలో లాక్ డౌన్ మే 17 వరకూ విధించింది కేంద్రం, ఇక మరో 14 రోజులు దేశం లాక్ డౌన్ లో ఉంటుంది, ఇది మూడో విడత లాక్ డౌన్ , అయితే మూడు జోన్లుగా ఇప్పటికే దేశంలో వైరస్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించారు, మరి తాజాగా ఆరెంజ్ జోన్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది సర్కార్ .అవి చూద్దాం.
ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపులు ఇచ్చింది కేంద్రం, ఈ జోన్లో కారులో ఇద్దరు పాసింజర్లు మాత్రమే వెళ్లాలి, ఇక వ్యక్తిగత వాహనాలు బండి కారు సైకిల్ ఏదైనా వేసుకుని ప్రయాణం చేయవచ్చు, కాని వారు రెడ్ జోన్ కు వెళ్లకూడదు.
టూ వీలర్ పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు, ఇక వ్యక్తిగత ప్రయాణాలపై ఆరెంజ్ జోన్లో ఆంక్షలు ఉండవు, అన్నీ వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, షరతులతో ప్రైవేట్ క్యాబులకి అనుమతి ఇచ్చింది..
విమాన రైలు మెట్రో బస్సులు నడపకూడదు, స్కూళ్లు కాలేజీలు కోచింగ్ సెంటర్లు తెరవకూడడదు,