బ్రేకింగ్ న్యూస్ – రైలులో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్?

బ్రేకింగ్ న్యూస్ - రైలులో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్?

0
104

ప్రపంచం అంతా ఇప్పుడు రెండు విషయాల గురించి ఆలోచిస్తోంది ..ఒకటి ఈ కరోనా గోల ఎప్పుడు తగ్గుతుంది, అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యంఎలా ఉంది.. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వస్తారు ఈ విషయాల గురించే యావత్ ప్రపంచం ఆలోచిస్తోంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించే చాలా మంది గూగుల్ చేస్తున్నారు.. రెండు వారాలుగా కిమ్ కనిపించకపోవడంతో అందరూ ఇదే చర్చించుకుంటున్నారు, ఏప్రిల్ 15న తన తాత, కొరియా జాతిపిత… రెండో కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఆయన హాజరు కాకపోవడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇక అక్కడ ప్రభుత్వం కూడా ఈ విషయం పై మౌనంగా ఉంది.

ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన తర్వాత… బ్రెయిన్ డెడ్ అయ్యి..కోమాలోకి వెళ్లిపోయారనే వార్తలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికా నిఘా సంస్ధలు కూడా దీని గురించి తెలుసుకుంటున్నాయి..ఉత్తర కొరియాలోని రిసార్ట్ టౌన్లో వాన్సాన్ ఎలైట్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన కుటుంబానికి చెందిన ట్రైన్ ఉంది, బహుశా ఆయన అందులో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.