బ్రేకింగ్ న్యూస్ – షిరిడీ ఆల‌యం పూర్తిగా మూసివేత‌

బ్రేకింగ్ న్యూస్ - షిరిడీ ఆల‌యం పూర్తిగా మూసివేత‌

0
105

దేశంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ క‌రోనా వైర‌స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇప్ప‌టికే దేశంలో చాలా మంది వైర‌స్ ల‌క్ష‌ణాతో చికిత్స పొందుతున్నారు, అయితే 14 రోజుల త‌ర్వాత మాత్ర‌మే ఈ వైర‌స్ భ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది అందుకే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.

ఇక ముంబైలో అయితే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, ఎక్క‌డ చెత్త లేకుండా చేస్తున్నారు, ఇక ఈ వైర‌స్ దెబ్బ‌కి ప‌ర్యాట‌క ప్రాంతాలు అన్నీ క్లోజ్ చేశారు.దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 39 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక ఈ వైర‌స్ దెబ్బ దేవాల‌యాల‌కు చూపిస్తోంది, అక్క‌డ తిరుమ‌ల‌కు కూడా భ‌క్తుల తాకిడి తగ్గింది, ఇటు
తాజాగా షిరిడిలోని సాయి ఆల‌యం కూడా మూసేస్తున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు అధికారులు.