దేశం చాలా క్లిష్టపరిస్దితిలో ఉంది, ఈ సమయంలో సర్కారు కొలువులు చేసే వారు ప్రతీ ఒక్కరు కచ్చితంగా వారి సర్వీస్ వారు చేస్తున్నారు, ముఖ్యంగా మెడికల్ పోలీస్ రక్షణ వ్యవస్ధ శానిటైజేషన్ సిబ్బంది ఇలా ప్రతీ ఒక్కరు ఉద్యోగం చేస్తున్నారు.
అయితే ఇంకొందరు కొన్ని సాకులు చూపి ఈ కరోనా వైరస్ కాలంలో ఉద్యోగాలు చేయడానికి రావడం లేదు అయితే ఇలాంటి వారిపై కేంద్రం సీరియస్ అయింది. ఎవరైతే విధులకు హాజరుకాలేదో, వారిని రిలీవ్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తూ, రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ, తమ ఉద్యోగులకు ఓ లేఖను రాసింది.
దీంతో ఇప్పటి వరకూ సాకులు చూపిన వారు రేపటి నుంచి విధులకి హజరుకానున్నారు, ఇలా ఎవరు రాకున్నా వారికి ఉద్యోగం ఉండదు అని స్పష్టం చేశారు, అయినా సరే ఉద్యోగానికి రాము అంటే ఈనెల 20 లోపు చెబితే మేమే రిలీవ్ చేస్తాం అన్నారు.