దేశంలో మరోసారి లాక్ డౌన్ పెడతారని ఇక ఈనెల 25 నుంచి దేశం అంతా మరో 35 రోజులు షట్ డౌన్ అవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, నేషనల్ మీడియా డిజిటల్ మీడియాలో బీభత్సమైన వార్తలు వచ్చాయి, ఇక ప్రధాని రెండు రోజుల పాటు ముఖ్యమంత్రులతో మాట్లాడిన సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు అని వార్తలు వచ్చాయి.
అయితే ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్ అయితే ఉండే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఇక్కడ కేసుల గురించి చర్చించారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని అడిగారు మరోసారి లాక్ డౌన్ విధిస్తారా అని
దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. అని తెలిపారు ఆయన…నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సో ఇక లాక్ డౌన్ పూర్తిగా అనేది ఉండదు అనేది క్లారిటీ వచ్చింది.