ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది… ఈ మహమ్మారి ఇప్పటికే కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకుంది… ఈ వైరస్ ను అంతమొందించేందుకు అన్ని దేశాలు సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు…
అయితే ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ ఒక అయింట్ మెంట్ ను విడుదల చేసింది.. ఈ ఈయింట్ మెంట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది… కరోనాతో సహా అనేక వైరస్ లను సంహరించేకు ఉపయోగపడుతుందని తెలిపారు.. అంతేకాదు దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యులు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరంలేదని తెలిపింది…
సొంతగా ఎవరైనా వాడుకోవచ్చని తెలిపింది…ఈ ఆయింట్ మెంట్ పేరు ఏపీటీ టీ3ఎక్స్… ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని తెలిపింది… కోవిడ్ 19 ఎదుర్కునే విషయంలో ఈ ఆయింట్ మెంట్ ముందు వరుసలో ఉంటుందని తెలిపింది..