బ్రేకింగ్ – ఓయో కంపెనీ సంచ‌ల‌న నిర్ణ‌యం

బ్రేకింగ్ - ఓయో కంపెనీ సంచ‌ల‌న నిర్ణ‌యం

0
93

కోవిడ్ కేసులు దేశంలో అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి…దీంతో ఆర్దిక వ్య‌వ‌స్ధ అతి దారుణంగా ప‌త‌నం అయింది, ఎవ‌రూ బ‌య‌ట‌కు రాని ప‌రిస్దితి.. అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు, అయితే హోట‌ల్ రంగంపై కూడా ఇది తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి, దేశంలో ప్ర‌జార‌వాణా లేక‌పోవ‌డంతో రూపాయి ఆదాయం లేక ఇబ్బందుల్లో ఉన్నారు.

సాఫ్ట్‌బ్యాంక్ సహకారంతో భారత్‌లోనే అతిపెద్ద హోటల్ చెయిన్‌గా అవతరించిన ప్రముఖ వ్యాపార సంస్థ ఓయో ఉద్యోగుల జీతాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో హోటల్స్ మూతపడటంతో రూమ్స్ బుకింగ్ అవకాశమే లేదు. ఆదాయం లేక ఇక ఇబ్బందుల్లో ఉంది.

ఒక్క బుకింగ్ కూడా లేక‌పోవ‌డంతో దేశంలో దారుణ‌మైన స్దితిలో ఉంది ఓయో, ఈ స‌మంలో త‌మ సంస్ధ‌లో ఇండియాలో పనిచేస్తున్న 7వేల మంది ఓయో ఉద్యోగుల జీతాల్లో నాలుగు నెలల పాటు 25 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ జీతం నుంచే కోతలు మొదలవుతాయని స్పష్టం చేసింది.