బ్రేకింగ్ — పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన బుట్టా రేణుక

బ్రేకింగ్ -- పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన బుట్టా రేణుక

0
85

రాజకీయంగా ఇటీవల చూసుకుంటే ఈ నాయకుడు ఈ పార్టీలో చేరుతున్నారు.. వీరు ఆ పార్టీలో చేరుతున్నారు అని వార్తలు వింటూ ఉంటాం…. ఇక వారి అభిమానులు సోషల్ మీడియా ఫాలోవర్స్ దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉంటారు, తమ నేత నాయకురాలు ఏ పార్టీలో చేరడం లేదు ఈ పార్టీలోనే ఉంటున్నారు అని చెబుతారు, ఇక ఇంకొందరు నేతలు దీనిపై మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా కూడా తెలియచేస్తారు, మేము పార్టీ మారడం లేదు అని.

 

తాజాగా కర్నూలు జిల్లాలో ఓ నాయకురాలి గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోంది.మాజీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారుతున్నారు అని వార్తలు వినిపించాయి.. కాని తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించారు..తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

 

మళ్లీ టీడీపీలోకి వెళ్తున్నాననే పుకార్లను నమ్మొద్దని బుట్టా రేణుక సూచించారు. నేను వైసీపీలో బాగానే ఉన్నాను అని తెలిపారు.. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. మొత్తానికి ఇటీవల వచ్చిన పుకార్లు నమ్మవద్దు అని కొట్టిపారేశారు ఆమె.