బ్రేకింగ్ .. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా రేష‌న్ షాపుల నుంచి 17 ర‌కాల వ‌స్తువులు ? ఇవే

బ్రేకింగ్ .. ప్ర‌జ‌ల‌కు ఉచితంగా రేష‌న్ షాపుల నుంచి 17 ర‌కాల వ‌స్తువులు ? ఇవే

0
46

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది, దీంతో నిరుపేద‌ల‌కు చాలా ఇబ్బందిక‌రంగా మారింది, వారికి ప‌నిలేక‌పోవ‌డంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు… ఈ స‌మ‌యంలో కేంద్రం కూడా వారికి సాయం అందిస్తోంది, ఇక రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా పేద‌ల‌కు సాయం చేస్తున్నాయి.. రేష‌న్ ఉచితంగా అందిస్తున్నాయి.

ఉచిత రేషన్‌తో పాటు డబ్బులు కూడా అందజేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేరళ సర్కార్ మరో అడుగు ముందుకేసి.. ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల సరుకులను ఓ కిట్ రూపంలో అందిస్తోంది.
ఇలా వైట్ రేష‌న్ కార్డ్ ఉన్న‌వారికి 17 ర‌కాల స‌రుకులు ఇంటికి అవ‌స‌రం అయిన‌వి ఇస్తున్నారు.

ఒక్కో కిట్‌లో దాదాపు వెయ్యి రూపాయల విలువైన సరుకులు ఉంటాయి. అవి ఏమిటో చూద్దాం.
బియ్యం,
కిలో పంచదార,
కిలో ఉప్పు,
250 గ్రాముల టీ పౌడర్,
కారం,
కంది పప్పు,
అరలీటర్ వంటనూనె,
రెండు కేజీల గోధుమ పిండి,
కేజీ రవ్వ,
మినుములు,
శనగలు,
సబ్బులు
మొదలైన 17 రకాల వస్తువులు ఉంటాయి. దీనిని ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించి రేష‌న్ దుకాణాల్లో తీసుకోవాలి అని తెలిపారు.