గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో 149 డివిజన్ ఫలితాలు మాత్రమే వచ్చాయి, తాజాగా మరో డివిజన్ ఫలితం కూడా వచ్చేసింది, ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, మరి ఆ డివిజన్ ఏమిటి అంటే, నేరెడ్మెట్… తాజాగా దీని ఫలితం వెల్లడి అయింది.
నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఆనందంలో ఉంది, అయితే మేయర్ పీఠం పై టీఆర్ఎస్ అభ్యర్ది ఉంటారు అని తెలుస్తోంది, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
తాజాగా నేడు కౌంటింగ్ రోజు నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం గ్రేటర్ లో 56 మంది కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో గెలిచారు.