కేంద్రంలో మోదీ సర్కారు రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ లు అనేకమైనవి తీసుకువస్తోంది, ముఖ్యంగా
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం దేశంలో అమలు అవుతున్న విషయం తెలిసిందే, ఏడాదికి ఆరువేల రూపాయలు రైతుల ఖాతాలో జమచేస్తోంది కేంద్రం… అయితే మూడు విడతల్లో 2000 చొప్పున ఆరువేలు నగదు జమ చేస్తారు.
తాజాగా పీఎం కిసాన్ స్కీమ్ రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చింది. మరి కొత్త రూల్స్ ఏమిటి అనేది చూద్దాం. కచ్చితంగా పొలం ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ నగదు డబ్బులు వస్తాయి.. కౌలుకి తీసుకుని చేస్తున్నా మీకు రాదు నగదు ఆ యజమానికి మాత్రమే వస్తుంది.
ఇక నెలకి సుమారు 10 వేల పించన్ తీసుకుంటున్న వారికి ఈ నగదు జమ అవ్వదు
కచ్చితంగా మీ అప్లికేషన్ స్టేట్ లో ప్రభుత్వం ఒకే చేయాలి అప్పుడు మాత్రమే కేంద్రం నుంచి నగదు వస్తుంది, అయితే ఇది కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి వర్తించనున్నాయి.