మలేసియా ఈ మధ్య భారత్ పై పలు వ్యాఖ్యలు చేస్తోంది, తాజాగా మన దేశ అంతర్గత విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు, మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ ..అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను సంచలనం అయింది, తాజాగా ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను ఆ దేశ రాజుకు పంపించారు. అయితే.. ఈ విషయంపై ప్రధాని కార్యాలయం ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ.. త్వరలో ఆయన మరో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తారనే కథనాలు ఆ దేశంలో వినిపిస్తున్నాయి.
అయితే దీనికి కారణాలు ఏమిటి అనేదానిపై విభిన్న చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇదే ఆ దేశంలో పెద్ద చర్చ. ఆయన 2018 మేలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు, . ప్రపంచంలో అధిక వయసున్న ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఇక.. మలేసియాకు ఎవరు సారథ్యం వహించబోతున్నారు, అనేది మాత్రం ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.