డవలప్ మెంట్ లో దూసుకుపోతోంది మన భారతీయ రైల్వే..విమానాశ్రయాల తరహాలో రైల్వేలో కూడా యూజర్ ఛార్జీలు చెల్లించే అవకాశం రావొచ్చు అని అంటున్నారు నిపుణులు, తాజాగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఈ ధర కూడా ఎంత ఉంటుంది అంటే రైల్వే టికెట్ పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర చెల్లించాల్సి రావొచ్చు అని తెలుస్తోంది.
ఇక రైల్వే శాఖ కూడా దీనిపై విధానం పూర్తి చేసింది అని తెలుస్తోంది, దీనిపై వచ్చే రోజుల్లో డెసిషన్ కోసం కేబినెట్ ముందుకు పంపుతారు, ఎంపిక చేసిన స్టేషన్లలో టికెట్ ధరకు అదనంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. అంతేకాని అన్నీ స్టేషన్లలో ఇలా చార్జీల వసూళ్లు ఉండవు.
ఇక ఎసీ ప్రయాణికులకు, సాధారణ స్లీపర్ సెకండ్ క్లాస్ ఇలా తరగతుల బట్టీ చార్జీలు ఉంటాయి , మన దేంలోమొత్తం 7 వేల స్టేషన్లు ఉన్నాయి, సుమారు ఇందులో 700 స్టేషన్లలో ఈ చార్జీలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఈ స్టేషన్లు పూర్తిగా అభివృద్ది చేసిన తర్వాత మాత్రమే యూజర్ చార్జీలు అమలులోకి వస్తాయి, అప్పటి వరకూ అమలు ఉండదు అంటున్నారు అధికారులు.