బ్రేకింగ్ – రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్

బ్రేకింగ్ - రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్

0
105

ఈ వైరస్ వల్ల మన దేశంలో రెండు నెలలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది… ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది, ఈ సమయంలో రైల్వే సర్వీసులు కూడా ఆగిపోయాయి, కాని కొత్తగా రాజధాని నుంచి 30 సర్వీసులు ప్రారంభించారు, అంతేకాకుండా శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి.

ఈ సమయంలో రైల్వేశాఖ జూన్ 1 నుంచి మరో రెండు వందల సర్వీసులు నడుపనుంది, దీనికి సంబంధించి 200 ప్రత్యేక మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా ఇప్పుడు దాన్ని 120 రోజులకు పెంచింది.

మే 12వ తేదీ నుంచి తిరిగే 30 ప్రత్యేక రాజధాని తరహ రైళ్లు, 200 ప్యాసింజర్ ట్రైన్స్కు ఈ రూల్ వర్తిస్తుందని , అలాగే ఈ రైళ్లలో పార్శిల్స్, లగేజీ బుకింగ్కు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆన్ లైన్ రిజర్వేషన్ టికెట్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు ప్రయాణానికి, కచ్చితంగా మాస్క్ ధరించి ప్రయాణం చేయాలి.