ఈ కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది, సెకండ్ వేవ్ లో దారుణంగా కేసులు బయటపడుతున్నాయి, అయితే చాలా వరకూ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు… మరికొందరు రైళ్లు బస్సులు ఆశ్రయిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు లేని కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది.
ఏప్రిల్ 28 నుంచి జూన్ 1 మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్-కర్నూలు ఎక్స్ప్రెస్
నరసాపురం-నిడదవోలు
నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్
బీదర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్
ఈనెల 30-మే 28 మధ్య సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ.. మైసూర్-రేణిగుంట ఎక్స్ప్రెస్,
వచ్చేనెల 1-మే 29 మధ్య రేణిగుంట-మైసూర్ ఎక్స్ప్రెస్
ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు…. అయితే ఇప్పుడు రద్దు అయిన రైళ్లు మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రకటనలో తెలియచేస్తాం అని రైల్వే తెలిపింది.