రైల్వే ప్రయాణికులు దాదాపు ఆరు నెలలుగా దేశంలో అన్నీ రైలు సర్వీసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో రైళ్లు నిలిపివేశారు, తాజాగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వేశాఖ.. ఇటీవల మరికొన్ని ప్రత్యేక రైళ్లని అనౌన్స్ చేశారు, వాటికి రిజర్వేషన్ కూడా కల్పించారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో 40 ట్రైన్లను కొత్తగా అదనంగా నడుపుతామని ప్రకటించింది.
ఈ కొత్త 40 ట్రైన్లు సెప్టెంబర్ 21 నుంచి రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇవి క్లోన్ ట్రైన్స్. రైల్వే శాఖ నిర్దేశించిన టైమింగ్స్‌లో ఇవి పట్టాలపై పరుగులు పెడతాయి.
ఇక వీటిలో ప్రయాణికులు ప్రయాణం చేయాలి అంటే కచ్చితంగా రిజర్వేషన్ చేసుకోవాలి, సాధారణ టికెట్లు మాత్రం ఇవ్వరు, ఇక హాల్ట్ అలాగే స్టాప్స్ కూడా తక్కువగా ఉంటాయి, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, జోన్ల అధికారులతో మాట్లాడి స్టాప్స్ ఫైనల్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 12 నుంచి 80 కొత్త స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా క్లోన్ రైళ్లు మరో 40,, అంతకు ముందు రెండువందల సర్వీసులు నడుపుతున్నారు, ఆ ముందు హస్తిన నుంచి 30 ట్రైన్స్ నడుపుతుంది రైల్వేశాఖ.