దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది… ఏప్రిల్ 14 వరకూ దేశంలో ఎలాంటి షాపులు తీయరు ..ఎలాంటి వ్యాపారాలు జరగవు.. ఎలాంటి కొత్త వ్యాపారాలు ఇప్పుడు ఉన్న వ్యాపారాలు సాగవు, ఇక సభలు సమావేశాలు పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా అన్నీ వాయిదా పడ్డాయి, ఈ సమయంలో రవాణా సౌకర్యాలు చూసుకుంటే ఏ రవాణా సౌకర్యాలు ఉండవు.
గూడ్స్ రైళ్లు మినహా మరే రైళ్లూ వచ్చే నెల 14 వరకు పట్టాలెక్కబోవని రైల్వే శాఖ ప్రకటించింది. వచ్చే నెల 14 వరకు దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఈనెల 21 వరకూ మాత్రమే ఇది అమలు అనుకున్నారు.. కాని కరోనా అంతకంతకూ పెరగడంతో ఈనెల 31 వరకూ అనుకున్నారు.
ఈ సమయంలో ప్రధాని నేరుగా లాక్ డౌన్ చెప్పడంతో ఈ విషయంలో రైల్వే కూడా సంచలన నిర్ణయం తీసుకుంది, ఏప్రిల్ 14 వరకూ ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో ఎక్కడా టికెట్ రిజర్వేషన్లు దేశంలో జరగవు అని తెలిపారు. ఇక ఏప్రిల్ 14 వరకూ రిజర్వేషన్లు చేసుకున్న వారికి వారి పూర్తి అమౌంట్ తిరిగి ఇవ్వనుంది రైల్వేశాఖ.