బ్రేకింగ్ – రైల్వేలో ఇక ఆ ఉద్యోగాలు ఉండ‌వు కీల‌క ప్ర‌క‌ట‌న

బ్రేకింగ్ - రైల్వేలో ఇక ఆ ఉద్యోగాలు ఉండ‌వు కీల‌క ప్ర‌క‌ట‌న

0
120

మ‌న దేశంలో రైల్వే డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేయాలి అని చాలా మందికి క‌ల‌, ఏ నోటిఫికేష‌న్ వ‌చ్చినా ల‌క్ష‌ల సంఖ్య‌లో అభ్య‌ర్దులు అప్లై చేస్తారు, అయితే తాజాగా రైల్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.
రైల్వే సీనియర్ ఉద్యోగుల ఇళ్లల్లో పనిచేసే కళాసీ లేదా బంగ్లా ప్యూన్ ఉద్యోగాల నియామకాలను రైల్వే నిలిపివేయనుంది.

ఈ పోస్టులు ఇప్ప‌టి వారికి తెలియ‌దు కాని గ‌తంలో చాలా మందికి ఈ ఉద్యోగాలు తెలుసు, ఇక ఈ పోస్టులు తీయ‌ద్దు అని బోర్డు ఆదేశించింది..ఇకపై టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీ పోస్టుల్ని భర్తీ చేయ‌రు.

అంతేకాదు 2020 జూలై 1 నుంచి నియమించిన ఈ పోస్టుల్ని రైల్వే బోర్డు సమీక్షించనుంది. రైల్వేలో తాత్కాలికంగా టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీ పోస్టుల్లో 8వ తరగతి పాసైన వారిని ఈ పోస్టుల్లో నియమించేవారు. వీరికి దాదాపు నెల‌కి 20 వేలు జీతం వ‌చ్చేది, వీరికి గ్రూప్ డి కేట‌గిరి సిబ్బందికి వ‌చ్చే అన్నీ బెనిఫిట్స్ రైల్వే నుంచి వ‌చ్చేవి..

గతంలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే అధికారులు ఆఫీసు పనులపై బయటకు వెళ్తే వారి కుటుంబ సభ్యులకు టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ కళాసీలు కాపలాగా ఉండేవారు. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేవారు. ఆ తర్వాత ఈ సిబ్బంది టికెట్ ఎగ్జామినర్, పోర్టర్, ఏసీ కోచ్ మెకానిక్స్‌, కుక్స్ పోస్టుల్లోకి మారేవారు. దీనిపై ఏర్ప‌డిన క‌‌మిటీ ఈ పోస్టులు నియ‌మించ‌క్క‌ర్లేదు అని తెలిపింది.