బంగారం ధర గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చింది మళ్లీ రెండు రోజులు తగ్గింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి. రూ.50,950కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గుదలతో రూ.46,700కు చేరింది.. బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు రూ.300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,300కి చేరింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు.. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు, వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.