దేశంలో రోజుకి నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… ఎక్కడ చూసినా వేలాది కేసులు బయటపడుతున్నాయి.. ఇక కేంద్రం కూడా రాష్ట్రాలకు లాక్ డౌన్ పై అధికారం ఇచ్చింది.. ఇక చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూ కొన్ని స్టేట్స్ అమలు చేస్తున్నాయి. ఇక భారీగా కేసులు రావడంతో తమిళనాడు కూడా లాక్ డౌన్ ప్రకటించింది.
10వ తేదీ నుంచి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.. అయితే ముందుగానే ప్రకటన చేయడంతో ఎక్కడివారు అక్కడ ఉంటారు, ఇక ప్రయాణాలు చేయాలి అని అనుకునే వారు కూడా ఈ రెండు రోజుల్లో వారు ఆ ప్లేస్ లకి చేరుకుంటారు, కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయి.
కిరాణ దుకాణాలు పాలు కూరగాయల షాపులు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి
రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చినా టేక్ అవేలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్
మెడికల్ షాపులు 24 గంటలు ఉంటాయి
అన్నీ ప్రభుత్వ శాఖలు పని చేస్తాయి సిబ్బంది వెళ్లవచ్చు