బ్రేకింగ్ – రేపు కమలం పార్టీలోకి రాములమ్మ కీలక పదవి

బ్రేకింగ్ - రేపు కమలం పార్టీలోకి రాములమ్మ కీలక పదవి

0
105

సరిగ్గా వారం రోజులు ఉంది జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ అంటున్నారు అనలిస్టులు, ఎందుకు అంటే రాములమ్మ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. రాములమ్మ మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఇప్పటి వరకూ ఆమె పార్టీ నుంచి వెళ్లిపోతారు అని అనేక వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఇదే నిజమవుతోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. వెను వెంటనే గ్రేటర్ కు వచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విజయశాంతి ప్రచారం చేయనున్నారు.

ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆమెతో మంతనాలు జరిపారు, బీజేపీ నేతలు వరుసగా ఆమెతో మాట్లాడారు, పార్టీలోకి రావాలి అని కోరారు.. చివరకు తన పాత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా విజయశాంతికి బీజేపీలో చేరిన తర్వాత కచ్చితంగా కీలకమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.