ఓ పక్క దేశాన్ని కరోనా వదిలిపెట్టలేదు మరో కొత్త బ్రిటన్ వైరస్ కూడా తన ప్రభావం చూపిస్తోంది, ఇలాంటి వేళ మన దేశంలో ఉత్తర భారతదేశంలో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. పక్షులు కోళ్లు వేలాదిగా చనిపోతున్నాయి, దీంతో చాలా మంది మాంసం తినాలి అంటే భయపడుతున్నారు.
కోళ్ల ఫారాలపై అధికంగా పడుతోంది బర్డ్ ఫ్లూ ప్రభావం…. ముఖ్యంగా చాలా మంది వ్యాపారులు తమకు నష్టాలు వస్తున్నాయి అంటున్నారు..హర్యానాలోని జీంద్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా మారింది, ఇక చాలా మంది చికెన్ అంటేనే భయపడుతున్నారు గుడ్డు కూడా సేల్ మొత్తం పడిపోయింది.
ఢిల్లీలో కిలో కోడి ఖరీరు రూ. 15కు పడిపోయింది. ఎవరూ కొనేవారు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది..సుమారు నాలుగు లక్షల కోళ్లు ఢిల్లీకి విక్రయించేందుకు ఇక్కడ నుంచి రోజూ వెళతాయి కాని ఇప్పుడు సేల్ లేదు, వ్యాపారులు వద్దు అంటున్నారు..ఢిల్లీలో కిలో కోడి 90 రూపాయల వరకూ ఉండేది.
ఇప్పుడు పదిహేను రూపాయలకు అమ్ముతున్నారు, ఇదే ఆందోళన కలిగిస్తోంది.