బ్రేకింగ్ – ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ – మీకు డ్రైవింగ్ నేర్పుతారు – ఎలా అప్లై చేసుకోవాలంటే

-

ఆర్టీసీ ఇప్పుడు కష్టాల్లోఉంది అనే చెప్పాలి, అంతేకాదు పలు చోట్ల డిపోల్లో ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది, ఇక కరోనా సమయంలో మరింత ఈ రంగం కుదేలు అయింది. తెలంగాణలో ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. ఐతే నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టిసారించింది టీఎస్ఆర్టీసీ.

- Advertisement -

ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ కార్గో సేవలు స్టార్ట్ అయ్యాయి, తాజాగా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ స్టార్ట్ చేయబోతోంది. అయితే ఇది కారు బైకులకి సంబంధించి కాదు, భారీ వాహనాలకు, మరి ఇవి నేర్చుకోవాలంటే కట్టదిట్టమైన శిక్షణ అవసరం. భారీ వాహనాల డ్రైవింగ్ నేర్పించే సంస్థలు ఎక్కడా లేవు.

ఈ సమయంలో టీఎస్ఆర్టీసీలోని సీనియర్ డైవర్ల ద్వారా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా.. ఆర్టీసీ పరిధిలో మొత్తం 9 డిపోలు ఉండగా అన్ని జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇది మంచి నిర్ణయం అని అంటున్నారు ప్రజలు. కేవలం సీనియర్ డ్రైవర్లు మాత్రమే నేర్పిస్తారు.

మహబూబ్ గర్, గద్వాల్, వనపర్తి ,నారాయణపేట, నాగర్ కర్నూల్లో మాత్రమే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించనున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కేంద్రం తెరచి ఉంటుంది.శిక్షణ పొందే అభ్యర్థి రూ.15,500 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.18 ఏళ్ల వయసుపైబడిన వారు మాత్రమే శిక్షణకు అర్హులు. ఇక ఎవరైతే అర్హులు ఉన్నారో వారు
లైట్ మోటర్ వెహికల్ లైసెన్సులు పొంది తప్పనిసరిగా ఏడాది పూర్తి అయి ఉండాలి. మొత్తం 36 రోజులు ఈ శిక్షణ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...