ఏపీ సీఎం వైయస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు, పార్టీని ముందు నుంచి నమ్ముకున్న వ్యక్తులకి పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్ అనేది మరోసారి నిరూపితం అయింది.ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సూర్యనారాయణ రాజు సురేశ్ బాబు పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు.
ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేశారు, ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు, దీంతో ఆ స్దానానికి ఎన్నిక జరగాల్సి ఉంది, ఈ సమయంలో సురేశ్ బాబు పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ. దీంతో నేడు ప్రకటన చేశారు సీఎం జగన్.
విజయనగరం జిల్లాకు చెందిన దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన కుమారుడు సురేశ్ బాబుకు జగన్ అవకాశం ఇచ్చారు అని అంటున్నారు నేతలు.