బ్రేకింగ్ — తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఎన్ని రోజులంటే

బ్రేకింగ్ -- తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఎన్ని రోజులంటే

0
95

తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికి లేకుండా ఉంది.. ఎందుకు అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి.
హైదరాబాద్ లో వర్షం రెండు రోజులుగా దంచి కొడుతోంది. భారీ వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దైపోయింది.

అయితే ఈ ఇబ్బందులు మరికొన్ని రోజులు తప్పవని తెలుస్తుంది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే మూడు రోజులు ఇలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ నిపుణులు.

మెదక్,
ఆదిలాబాద్,
మేడ్చల్
నిర్మల్
నిజామాబాద్
రాజన్న సిరిసిల్ల
జగిత్యాల,
కామారెడ్డి,
సంగారెడ్డి,
హైదరాబాద్,
రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి.