బ్రేకింగ్… తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు… ఇద్దరు డాక్టర్లు…

బ్రేకింగ్... తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు... ఇద్దరు డాక్టర్లు...

0
98

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది… తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకింది… దీంతో రాష్ట్రం మొత్తంమీద కరోనా సోకిన వారి సంఖ్య 44కు చేరింది… కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్య భర్తలైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ గా తెలింది…

దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది… వైద్యులకు సరైన సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యులకు కరోనా సోకటం పై ఆందోళన చెందుతున్నారు… దీంతో దోమల గూడలో శానిటైజేషన్ చేస్తున్నారు…

కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చాడు కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటంవల్లే ఆయనకు పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలుపుతున్నారు… ఇతనితోపాటు వైద్యులైన భార్యభర్తలకు ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు…