బ్రేకింగ్ – తెలంగాణ నుంచి ఏపీకి బస్సు సర్వీసులు ఉండవు – ఎందుకంటే

బ్రేకింగ్ - తెలంగాణ నుంచి ఏపీకి బస్సు సర్వీసులు ఉండవు - ఎందుకంటే

0
79

దేశంలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి.. రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల పాజిటీవ్ కేసులు వస్తున్నాయి… అయితే మన ఏపీ తెలంగాణ స్టేట్స్ లో కూడా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి, ముఖ్యంగా ఏపీలో కూడా భారీగా కేసులు రావడంతో ఎన్నో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది జగన్ సర్కార్.

కరోనా వ్యాప్తి నివారణకు ఏప్రీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది… మధ్నాహ్నం ఆరు తర్వాత అత్యవసర సర్వీసులు మాత్రమే ఉంటాయి… కారులు బస్సులు ఇలా ఏవి బయటకు రావడానికి లేదు.. కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు..

ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలో 12 తర్వాత కర్ఫ్యూ ఉంటుంది దీంతో ఉదయం వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి ఏపీలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లేదని.. అందుకే ఇలా బస్సులు నిలిపివేస్తున్నాము అని తెలిపారు, ఇక రిజర్వేషన్లు ఆపేశారు.

అత్యవసర వాహనాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఏపీ ప్రభుత్వం నుంచి దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.