బ్రేకింగ్ – తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ – ఇది తెలుసుకోండి

బ్రేకింగ్ - తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ - ఇది తెలుసుకోండి

0
81

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఇక సీఎం కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు, ఇక కేసులు దారుణంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది…రాష్ట్ర్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో రాత్రీపూట కర్ఫ్యూ కు విధించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే చాలా స్టేట్స్ లాక్ డౌన్ కు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు, తాజాగా తెలంగాణలో కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

 

రాత్రీ 9 నుండి ఉదయం 5 గంటలవరకు ఈ ఆంక్షలు ఉంటాయి.. మే ఒకటి వరకు కర్ఫ్యూ నిర్వహించనున్నారు. అయితే దీని నుండి అత్యవసర సర్వీలను మినహాయించనున్నారు. తెలంగాణలో కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్లకు మినహాయింపు ఇచ్చారు.

 

రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎవరైనా సరే రాత్రి తొమ్మిది తర్వాత బయటకు రావడానికి లేదు, అత్యవసరమైన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే క్లబ్బులు పబ్ లు రాత్రి ఇక ఉండవు, మాస్క్ ధరించి ఉదయం పూట మీ పనులు చేసుకోవాలి.