ఇటీవల తమిళనాడులోని ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఆపార్టీ చీఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక ఈ రోజు ఆయన ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. మొదటి రోజే ఆయన కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు… ఈ కరోనా సమయంలో పేద ప్రజలకు ఎన్నో వరాలు కురిపించారు ఆయన..
మరి ఆయన ప్రకటించిన వరాలు ఏమిటో చూద్దాం..
1.. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు.
2.. తమిళనాడులో రేషన్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాలకు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు
3. ఈ నాలుగు వేల సాయం కోవిడ్ ఆర్ధిక సాయంగా అందిస్తున్నారు
4.. ముందు ప్రతీ ఒక్కరికి రెండు వేలు ఇస్తారు
ఆ తర్వాత విడతలో మరో 2000 అందిస్తారు
ఇక మరో గుడ్ న్యూస్ తమిళనాడు వ్యాప్తంగా లీటరు పాలపై రూ.3 తగ్గిస్తూ తమిళనాడు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు బాగున్నాయి అని ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.