ఏదైనా ఫంక్షన్ కి కార్యక్రమానికి వెళితే అక్కడ టీ బిస్కెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇక మార్కెట్లో మనం టీ కాఫి బిస్కెట్ తీసుకుంటే కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే… అయితే ఉచితంగా ఎవరూ మార్కెట్లో ఇవ్వరు కదా, సో
హైదరాబాద్ నగరంలో ఓ సంస్థ కొత్తగా ఫ్రీ చాయ్ కౌంటర్ను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ లో
దీనిని ఏర్పాటు చేశారు… ఇక్కడ స్టాల్లో ఫ్రీగా టీ, బిస్కెట్స్ అందించనున్నారు.
ఇక ఇక్కడకు వచ్చిన వారు ఉచితంగా మంచినీరు తాగచ్చు.. టీ బిస్కెట్ తీసుకోవచ్చు, ఇక లేడీస్ కు జెండ్స్ కు విడి విడిగా ఆ కౌంటర్లు పెట్టి ఇస్తున్నారు, మంచి వాష్ రూమ్ కూడా ఉంచారు, లూ కేఫ్తో కలిసి రవీంద్రనాథ్ ఫౌండేషన్ ఈ స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడకు ఎవరైనా వచ్చి టీ తీసుకోవచ్చు అని తెలిపారు.
మరి ఈ ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారా, హైదరాబాద్ లోని ఇండో అమెరికన్ ఆస్పత్రి సమీపంలో, కేబీఆర్ పార్క్కు ఎదురుగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ బసవతారకం ఆస్పత్రికి రెండు తెలుగు స్టేట్స్ నుంచి రోజు వందల మంది వస్తూ ఉంటారు, ఇక్కడ పనిచేసేవారు చాలా మంది ఉంటారు.. ఇలాంటి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజు మూడు వందల నుంచి 400 మందికి ఇక్కడకు వస్తున్నారు, మరి ఏ ఏ సమయం అంటే ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది.