బ్రేకింగ్ — తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

బ్రేకింగ్ -- తగ్గిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
93

బంగారం కొనాలి అని చాలా మంది చూస్తున్నారు.. అయితే గత నెల రోజులుగా చూస్తే బంగారం ధర భారీగా తగ్గింది.. ఇప్పుడు గత పది రోజులుగా చూస్తే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో బంగారం ధర భారీగా పెరుగుతోంది, మరి రెండు నెలలుగా డౌన్ అవుతూ ఉన్న పుత్తడి ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యే సమయంలో భారీగా ధర పెరుగుతోంది, మరి నేడు రేట్లు చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.47,350కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గడంతో రూ.43,400కు ట్రేడ్ అవుతోంది, ఇక బంగారం వెండి మరింత తగ్గుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

 

 

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా తగ్గింది…వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,600కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.