ఏపీలో ఓ అంశం పెను సంచలనం అయింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు… రెండు రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు… దేశంలో ఇది సంచలనం అయింది, అయితే స్ధానికనేత అయిన గంటా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ఏపీ స్పీకర్ కు తన రాజీనామా లేఖ రాసి పంపించారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ను గంటా కోరారు..
అయితే విశాఖలోనే రాజకీయంగా గంటా ఇంత పెద్ద నేతగా ఎదిగారు, మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. అలాంటి ఆయన ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని గంటా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ విషయంలో పోరాటం చేయాలని భావస్తున్నారు ఆయన.