బ్రేకింగ్ – తిరుమలలో దర్శనాలకు ఒకే ఎప్పటినుంచంటే

బ్రేకింగ్ - తిరుమలలో దర్శనాలకు ఒకే ఎప్పటినుంచంటే

0
116

ఈ వైరస్ తో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది, అయితే కేంద్రం ఇప్పుడు సడలింపులు కూడా ఇచ్చింది, ఐదో విడత లాక్ డౌన్ అమలు అవుతూనే ఇటు సడలింపులు ఇచ్చింది సర్కార్.. ఈ సమయంలో రెండు నెలలుగా ఆలయాలు ఏమీ తెరచుకోలేదు, భక్తులకి ఎలాంటి దర్శనాలు లేవు, తాజాగా కేంద్రం సడలింపులు ఇవ్వడంతో ఆలయాలు కూడా తెరచుకోనున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనాలు తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు స్టార్ట్ అవ్వనున్నాయి, ఇప్పటికే తితిదే ఏర్పాట్లు కూడా చేసింది.

ట్రయల్ పద్ధతిలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. ముందుగా తిరుమల ఆలయ ఉద్యోగులు, తిరుమల తిరుపతి భక్తులకి అవకాశం ఇవ్వనున్నారు, పరిమిత సంఖ్యలోనే భక్తులకి అవకాశం ఇవ్వనున్నారట. భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్లు వాడాలి, అలాగే మాస్క్ ధరించి భక్తులు రావాలి.