మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు పరుగులు పెట్టింది… నేడు మార్కెట్లో బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. ఇక బంగారం బాటలో వెండి ధర కూడా పరుగులు పెట్టింది.. పుత్తడి వెండి ధరలు మళ్లీ పెరిగాయి.. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చుక్కలు అంటాయి, మరి నేటి మార్కెట్ ధరలు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగింది. దీంతో రేటు రూ.47,190కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.260 పెరిగింది దీంతో రూ.43,260కు ట్రేడ్ అవుతోంది, ఇక బంగారం ధర ఇలా ఉంటే.
వెండి రేటు కూడా పెరిగింది, వెండి ధర కేజీకి రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.73,800కు చేరింది.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు…. మరీ ముఖ్యంగా బంగారం వెండి ధరలు మరో రెండు నెలల వరకూ సాధారణంగానే ఉంటాయి అని బులియన్ నిపుణులు చెబుతున్నారు.