దేశ ప్రజలు అందరికి ముఖ్య గమనిక ..ఇక వాహనాలకు వచ్చే నెల అంటే జనవరి 2021 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలి.. తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే గత నాలుగు నెలలుగా ఈ వార్త అందరికి తెలియచేశారు, ఇక మిగిలిన వాహనాలకు కూడా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలి.
కచ్చితంగా జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ లు ఉంటేనే టోల్ ప్లాజాల దగ్గర అనుమతిస్తారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టోల్ ఫీజును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడాన్నే ఫాస్టాగ్ గా పిలుస్తారు, ఇక ఎలాంటి ఆలస్యం ఉండకుండా మీ వాహనాలు వెంటనే ముందుకు వెళ్లవచ్చు, ఇప్పటికే 50 శాతం మంది ఫాస్టాగ్ తీసుకున్నారు.
సమయం, వెయిటింగ్ ఉండదు, ఇక పేపర్ లెస్ అలాగే ఎలక్ట్సానిక్ డిజిటల్ పద్దతిలో పేమెంట్ అవుతుంది.. ఇక సమయం ఆదా ఇంధనం ఆదా అవుతుంది..ఫాస్టాగ్ వ్యవస్థను దేశంలో 2016లో తీసుకువచ్చారు. 2018 నాటికి 34 లక్షల ఫాస్టాగ్ లు జారీ అయ్యాయి. ఇక కొత్త వెహికల్ రిజిష్ట్రేషన్ సమయంలో ఫాస్టాగ్ ఉండాల్సిందే కొత్త రూల్ తీసుకువచ్చారు.