ఓ పక్క రేట్లు పెరగడమే కానీ ఎక్కడా తగ్గడం లేదు.. ఓ పక్క పెట్రోల్ డిజీల్ వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, అయితే ఎంటర్ టైన్మెంట్ ఇంట్లో ఉండి పొందాలి అంటే కచ్చితంగా టీవీ అనే చెబుతాం.. మరి ఆ టీవీల ధరలు కూడా వచ్చే నెల నుంచి పెరగనున్నాయి అని తెలుస్తోంది.
గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండడంతో భారత్ లో కంపెనీలు టీవీల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచాయి తాజాగా మరికొన్ని కంపెనీలు కూడా వచ్చే నెల నుంచి రేట్లు పెంచనున్నాయి.
ఎందుకు అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి, అందుకే టీవీల ధరలు పెంచుతున్నాము అని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు… అయితే ఎంత మేర పెరుగుతాయి అంటే, ఈ ధరలు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.. 32 అంగుళాల టీవీలు రూ.5 వేల నుంచి పెరిగే ఛాన్స్ ఉంది.
|
|
బ్రేకింగ్ — TV కొనాలనుకుంటున్నారా ఇది తప్పక తెలుసుకోండి
-