భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఏపీలో కూడా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ చెబుతోంది.. గోదావరి కృష్ణా నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి, అయితే వరద ప్రభావంలో ఇంక వేలాది ఇళ్లు- లక్షలాది మంది జనం ఉన్నారు, రైతులు నష్టపోయారు, ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. వారానికిపైగా వరద ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు ఈ సరుకులు పంపిణీ చేయనున్నారు.
వరద ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉందో ఆ ప్రాంతాల జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి…కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఏఏ వస్తువులు ఇస్తున్నారు అనేది చూస్తే
ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం
కేజీ కందిపప్పు
లీటర్ పామాయిల్
కేజీ ఉల్లిపాయలు
కేజీ బంగాళాదుంపలు అందిస్తున్నారు