బ్రేకింగ్ –ఈ నెల 15 నుంచి షర్మిల మూడు రోజుల దీక్ష

బ్రేకింగ్ --ఈ నెల 15 నుంచి షర్మిల మూడు రోజుల దీక్ష

0
111

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది, ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా చేశారు వైయస్ షర్మిల, మొత్తానికి రాజన్న రాజ్యం తీసుకువచ్చే దిశగా ఆమె రాజకీయ పార్టీని పెట్టనున్నారు…తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మరో పార్టీ ఎదురు నిలువనుంది. ఇక ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు షర్మిల.

 

తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన ఆమె నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇక తాజాగా ఆమె ఈనెల 15 నుంచి హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేస్తున్నట్లు అనుచరులు ప్రకటించారు.

 

ఇదే విషయాన్ని నిన్న కూడా షర్మిల ఖమ్మం సభలో ప్రకటించారు. ఓపక్క తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.. ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దీనిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ దీక్ష చేసినా సర్కారు స్పందించకపోతే జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఆమె అనుచరులు చెప్పారు.