ఈ ఏడాది నోబెల్ విజేతలను వరుసగా జ్యూరీ ప్రకటిస్తోంది, తాజాగా భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ వరించింది. కృష్ణబిలంపై పరిశోధనలు నిర్వహించినందుకు వీరికి నోబెల్ వరించింది.
రోజర్ పెన్రోస్, రిన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్లకు నోబెల్ పురస్కారం ప్రకటించారు కమిటీ సభ్యులు.
అవార్డును రెండు భాగాలు చేసిన రాయల్ స్వీడిష్ అకాడమీ.. ఒక భాగం అవార్డును రోజర్ పెన్రోజ్కు ఇవ్వనున్నది. మరో భాగాన్ని రీన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్లకు ఇవ్వనున్నారు.
రూ.6.5 కోట్లలో సగం పురస్కారాన్ని రోజర్ పెన్రోస్కు ఇవ్వగా.. మిగతా సగాన్ని రిన్హార్డ్, ఆండ్రియాలు పంచుకోనున్నారు.
వీరు పరిశోధనలో సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణబిలం ఏర్పడినట్లు నిర్ధారించారు. సువిశాల విశ్వంలోని పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్హోల్ గురించి ఆసక్తికర అంశాలు కనుగొన్నందుకు శాస్త్రవేత్తలకు ఈ నోబెల్ వరించింది, ఇది విశ్వంలో ఎంతో గొప్ప విషయం దీనిని వీరు కనుగొన్నారు అని తెలిపింది కమిటీ.