బ్రేకింగ్ ….తిరుమలలో భక్తులకు మరో ప్రసాదం ఇవ్వనున్న తితిదే.

బ్రేకింగ్ ....తిరుమలలో భక్తులకు మరో ప్రసాదం ఇవ్వనున్న తితిదే.

0
103

తిరుమల అంటే వెంటనే వెంకన్న గుర్తు వస్తారు … ఆయన దర్శనం చేసుకున్న తర్వాత స్వామి ఆలయం పక్కన ఉండే అన్నదాన సత్రంలో అన్నదనాం చోటుకి వెళ్లి భక్తులు భోజనం చేస్తారు, ఆ తర్వాత కచ్చితంగా ప్రసాదంగా లడ్డూ తీసుకోవాల్సిందే, తిరుమల వెళితే లడ్డూ తెచ్చారా అనేలా స్వామి ప్రసాదం అడిగి మరీ తీసుకుంటాం.

అంతటి రుచి ఆ లడ్డూకి సొంతం. అయితే స్వామికి అనేక ప్రసాదాలు నిత్యం నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా చాలా మందికి లడ్డూ మాత్రమే తెలుసు… కాని స్వామికి పెట్టే ప్రసాదాల్లో అత్యంత రుచికరమైనది వడ అనేది మీకు తెలుసా.. అయితే ఇది భక్తులు అందరికి ఎప్పుడూ దొరకదు,
ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులకు, సిఫారసు లేఖలు పొందగలిగిన వారికి మాత్రమే లభిస్తుంది ఈ వడ ప్రసాదం.

కాని తాజాగా సాధారణ భక్తులకి కూడా వడ ప్రసాదం అందించనుంది ప్రసాదం కౌంటర్లలో. ఒక్కో వడను రూ.100 చొప్పున స్టాక్ ఆధారంగా ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంటోందట.లడ్డూకౌంటర్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పెద్దలడ్డూలను ఒక్కోటీ రూ.200 రూపాయాలకు విక్రయిస్తున్న టీటీడీ తాజాగా వడప్రసాదం పై ఈ నిర్ణయం తీసుకుంటోంది అని తెలుస్తోంది.