బంగారం ధర గత 3 రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త సాధారణంగా ట్రేడ్ అవుతోంది…బంగారం ధర మార్కెట్లో సాధారణంగా ఉంటే వెండి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర నిలకడగా ఉంది, నిన్నటి రేటు ట్రేడ్ అవుతోంది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.50,950 దగ్గర ట్రేడ్ అవుతోంది… అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 దగ్గర స్దిరంగా ఉంది.
బంగారం ధర నిలకడగానే ఉంటే.. వెండి ధర మాత్రం తగ్గింది. వెండి రేటు రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.72,200కి చేరింది..వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు.. వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.