బ్రేకింగ్ – నేడు మార్కెట్లో తగ్గిన బంగారం ధర రేట్లు ఇవే

బ్రేకింగ్ - నేడు మార్కెట్లో తగ్గిన బంగారం ధర రేట్లు ఇవే

0
86

బంగారం కొనాలి అని అనుకుంటున్నారా రెండు రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది.. మరి నేడు పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి బులియన్ మార్కెట్లో వెండి బంగారం ధరలు ఓసారి పరిశీలిద్దాం. సో బంగారం ధర అయితే తగ్గింది. ఇది నిజంగా కొనాలి అని చూసేవారికి గుడ్ న్యూస్.. అయితే ఎంత మేర తగ్గింది వెండి బంగారం అనేది చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.47,350కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గి రూ.43,400కు చేరింది.. వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

 

బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.71,900 కి ట్రేడ్ అవుతోంది..అయితే ఉగాది రోజు బంగారం వెండి అమ్మకాలు దాదాపు 12 శాతం మేర పెరిగాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.