గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది… బంగారం ధర ఈరోజు ముంబైలో కాస్త తగ్గింది.. మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే పుత్తడి హైదరాబాద్ లో ఎలా ట్రేడ్ అవుతోంది అనేది చూద్దాం.. ఈ పదిరోజుల్లో బంగారం తగ్గింది కేవలం రెండు రోజులు మాత్రమే…. పెరిగింది 6 రోజులు… ఇక రెండు రోజులు ధర స్దిరంగా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.510 పడిపోయింది.. రూ.48,670కు చేరింది…. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే కొనసాగింది.. ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.44,610 దగ్గర ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం వెండి ధర పెరిగింది. రూ.400 పెరిగింది ధర….. దీంతో కేజీ వెండి ధర రూ.76,500కు ట్రేడ్ అవుతోంది…. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది… కాని తగ్గే సూచనలు లేవు అంటున్నారు వ్యాపారులు.