పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల నుంచి మంచి మద్దతు పొందింది జగన్ సర్కారు, ప్రతీ నెలా కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు సీఎం జగన్.. ఇక దేశ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకుంటున్నారు అందరూ .తాజాగా ఏపీ సీఎం జగన్ దేశంలో బెస్ట్ సీఎంల జాబితాలో టాప్-3లో నిలిచారు.
ఇక ఉత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ మూడో ప్లేస్ లో నిలిచారు, దేశ్ కా మూడ్ పేరిట ఏబీసీ, సీ-ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పాలనలో బెస్ట్ గా చేస్తుంది ఎవరు అనేదానిపై
ఈ సర్వే చేశారు.. మొత్తం జాతీయ స్ధాయిలో ఈ సర్వే జరిగింది.
ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుతో సమర్దవంతమైన పాలన ఇవన్నీ చూసి సర్వే చేశారు. తొలిస్ధానంలో
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ , ఇక డిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు
ఆ తర్వాత స్థానంలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు.