ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఓసారి వచ్చేది పుష్కరం, మరి ఈ ఏడాది పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు జరుగనున్నాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 దాకా ఇవి జరగనున్నాయి. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు జరుపుతారు. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి.
కర్నాటక ప్రాంతం ఎగువ భాగాన ఉన్న పశ్చిమ కనుమలలో ఉద్భవించినవే తుంగ, భద్ర. ఇది కర్నాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది, మన తెలుగు నేల అయిన
కర్నూలు జిల్లాలో గల కౌతాళం మండలం మేళగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది.
అలా సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక మనకు కురిసిన భారీ వర్షాలతో ఈ నదిలో నీరు పుష్కలంగా ఉంది.. కర్నూలు జిల్లాలో అలాగే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఆలంపూర్ లోనూ ఈ పుష్కరాలు జరుగుతాయి. ఇక ఈ పుష్కరాలకు దేశంలో నలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది, సుమారు కోటి మంది వరకూ వస్తారు అని అంచనా, ఏపీ తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు అక్కడ ఘాట్లలో ఏర్పాట్లు చేయనున్నారు అని తెలుస్తోంది.